Header Banner

ఉద్యోగుల కోతకు ఈవీ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్.. వెయ్యి మంది జాబ్స్ ఊస్ట్.!

  Tue Mar 04, 2025 14:23        Business

వెయ్యిమందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపేందుకు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ సిద్ధమవుతోంది. వీరిలో రెగ్యులర్ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్ సిబ్బంది కూడా ఉన్నారు. నష్టాలను తగ్గించుకోవడంలో భాగంగా సంస్థ  ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఐదు నెలల వ్యవధిలో ఓలా రెండోసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కొనుగోళ్లు, కస్టమర్ రిలేషన్స్ సహా పలు విభాగాల్లో ఈ కోతలు ఉంటాయని సమాచారం. నవంబర్‌లో ఓలా 500 మంది ఉద్యోగులను తొలగించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ఓలా నష్టాలు 50 శాతం పెరిగిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ సిబ్బందితో కలుపుకొని ఓలాలో మొత్తం 4 వేల మంది పనిచేస్తున్నారు. తాజా తొలగింపులు వీరిలో పావు వంతు భాగం కావడం గమనార్హం. ఫ్రంట్ ఎండ్ ఆపరేషన్లను ఆటోమేటెడ్ చేసి ఖర్చులను తగ్గించుకొని, వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించేందుకు కంపెనీని పునర్నిర్మిస్తామని ఓలా పేర్కొంది. ఆగస్టులో పబ్లిక్ ఇష్యూకు వెళ్లిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 60 శాతం నష్టపోయాయి. ఫిబ్రవరిలో ఓలా 25 వేల యూనిట్లు అమ్మింది. నిర్ధారిత లక్ష్యం 50 వేలలో ఇది సగం మాత్రమే కావడం గమనార్హం.  


ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురు దెబ్బ! కీలక నేత పార్టీకి గుడ్‌బై.. జనసేనలోకి..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్ల‌డి!

 

రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...

 

గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?

 

వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?

 

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

 ఏపీలో ఉచిత విద్యుత్‌పై మంత్రి కీలక ప్రకటన! ఇకపై అలా జరగకుండా..

 

బెజవాడలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనం.. 600 గజాల స్థలాన్ని కొనుగోలు! 6న భువనేశ్వరి శంకుస్థాపన..

 

దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

 

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #OlaElectric #LayOffs #BusinessNews #ViralNews #Jobs